CJI Surya Kant: విద్యార్థి నిరసనలపై సీజేఐ కీలక వ్యాఖ్యలు.. యువత పట్ల పోలీసులు సంయమనం పాటించాలి!

CJI Surya Kant: సీజేపీ నిరసనలు, విద్యార్థి ఆందోళనలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 2:58 PM IST
CJI Surya Kant
X

CJI Surya Kant: విద్యార్థి నిరసనలపై సీజేఐ కీలక వ్యాఖ్యలు.. యువత పట్ల పోలీసులు సంయమనం పాటించాలి!

CJI Surya Kant: సీజేపీ నిరసనలు, విద్యార్థి ఆందోళనలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు. యువత నిరసనల పట్ల పోలీసులు సంయమనం పాటించాలని, వారి ఆవేదనను వినడమే సరైన పరిష్కారమని వ్యాఖ్యానించారు.

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలు, విద్యార్థుల ఆందోళనలపై భారత అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు స్పందించింది. ఆందోళనల్లో పాల్గొంటున్న యువ విద్యార్థి నిరసనకారుల పట్ల భద్రతా బలగాలు, అధికారులు తీవ్రమైన ప్రతిస్పందనలు చూపకుండా అత్యంత జాగ్రత్తగా, సంయమనంతో వ్యవహరించాలని ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.

ప్రజాస్వామ్యంలో శాంతియుత ప్రదర్శనలకు హక్కు ఉందని, యువత ఎందుకు ఆందోళన చెందుతున్నారో, వారు ఏం చెప్పాలనుకుంటున్నారో అధికారులు ఓపికగా వినడమే అన్నింటికంటే పెద్ద పరిష్కారమని సీజేఐ అభిప్రాయపడ్డారు. హింసను అదుపు చేసే నెపంతో పోలీసులు తీవ్రమైన బలప్రయోగానికి దిగితే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు.

ఢిల్లీతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సీజేపీ నిర్వహించిన నిరసనల్లో రాళ్లదాడి, హింస చోటుచేసుకున్నాయని, జరిగిన నష్టానికి సదరు సంస్థనే బాధ్యులను చేయాలని దాఖలైన పిటిషన్‌ను.. విద్యార్థి ఆందోళనలపై ఉన్న మిగిలిన పిటిషన్లతో సుప్రీంకోర్టు జతచేసింది.

జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో రాళ్లదాడి, లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లు మరియు పెల్లెట్ తుపాకుల వినియోగం వల్ల విద్యార్థులు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో అధికారుల విచక్షణపై కోర్టు నమ్మకం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత వర్గాల వైఖరిని పరిశీలించిన అనంతరం తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story