CJP: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌.. అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలకు సీజీపీ పిలుపు!

CJP: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలకు సీజీపీ పిలుపు. ముంబయి శివాజీ పార్క్‌‌లో 'జైల్ భరో' ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరణ.

Arun Chilukuri
Published on: 1 Oct 2026 5:33 PM IST
CJP
X

CJP: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌.. అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త నిరసనలకు సీజీపీ పిలుపు!

CJP: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అక్టోబర్‌ 2 నుంచి ఈ నిరసనలు ప్రారంభంకానున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే వెల్లడించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేసిన ఆయన, సీఈసీపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, సీఈసీ నియామకంలో పూర్తి పారదర్శకత ఉండాలని, పౌర సమాజానికి భాగస్వామ్యం కల్పించాలని కోరారు.

నిరసనల్లో భాగంగా అక్టోబర్‌ 2న సాయంత్రం ముంబయిలోని చారిత్రాత్మక శివాజీ పార్క్‌లో ‘జైల్‌ భరో ఆందోళన్‌’ చేపట్టాలని సీజీపీ నిర్ణయించింది. అయితే, హైకోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ సభల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని సూచించారు. పోలీసులతో పాటు శివాజీ పార్క్ పరిసర ప్రాంతాల నివాసితులు కూడా ఈ నిరసనను తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.