CJP: ‘ఇది విద్యార్థుల విజయం’ - సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే
CJP: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థుల విజయంగా అభివర్ణించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.
CJP: ‘ఇది విద్యార్థుల విజయం’ - సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే
CJP: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర హర్షం వ్యక్తం చేసింది. “ఇది విద్యార్థుల విజయం” అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. రాజీనామా వార్త వెలువడగానే దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. “శాంతియుతంగా చేసే ఏ ఆందోళనతో అయినా లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. ఈ విషయాన్ని నేను గాంధీజీ నుంచి నేర్చుకున్నాను. ఈ దేశ యువత చేసిన శాంతియుత నిరసనలు వృథా పోలేదు. విద్యార్థుల పోరాటం ఫలించింది, వారి సత్తా ఏంటో దేశానికి తెలిసింది. ఈ విజయం విద్యార్థులందరిది... ప్రజాస్వామ్యం అంటే ఇదే అభిజీత్ దీప్కే.
మిగతా డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమం ఆగేది లేదు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ, ఉద్యమం ఇంకా ముగియలేదని సీజేపీ స్పష్టం చేసింది.




