Saurav Das: కంగనాకు సౌరవ్ దాస్ స్ట్రాంగ్ కౌంటర్: ‘నేను హృతిక్ రోషన్‌లా కనిపిస్తున్నానా?’

Saurav Das: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన విమర్శలకు కాక్రోజ్ జనతా పార్టీ (సిజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 30 July 2026 1:05 PM IST
Saurav Das
X

Saurav Das: కంగనాకు సౌరవ్ దాస్ స్ట్రాంగ్ కౌంటర్: ‘నేను హృతిక్ రోషన్‌లా కనిపిస్తున్నానా?’

Saurav Das: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తనపై చేసిన ఘాటు విమర్శలకు కాక్రోజ్‌ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తనను ‘పనికిరాని వాడు’, ‘నిరుద్యోగి’ అని సంబోధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. గూగుల్‌లో శోధిస్తే ఇలాంటి తప్పుడు సమాచారమే వస్తుందని, నిజాలను తెలుసుకోవాలని హితవు పలికారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సౌరవ్, కంగనా ఈ దేశ భవిష్యత్ తరాలను, యువతను నిరంతరం తీవ్రంగా విమర్శించడం సరికాదని అన్నారు.

కంగనా విమర్శలపై సౌరవ్ దాస్ వ్యంగ్యంగా స్పందిస్తూ కొన్నిసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘నా వ్యాఖ్యలపై కంగనా ఎందుకు అంత తీవ్రంగా స్పందించారో నాకు అర్థం కావడం లేదు. నా స్నేహితులు కూడా ఇదే మాట అంటున్నారు. ఒక ఫ్రెండ్ ఐతే ఏకంగా ‘ఆమెకు నువ్వు చిన్నప్పటి హృతిక్ రోషన్ లాగా కనిపిస్తున్నావేమో’ అని మెసేజ్‌ చేశాడు. నా ఫ్రెండ్స్ అలా అనడంతో నేను నిజంగానే చాలా ఆశ్చర్యపోయాను’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అయితే, తనకు కంగనా రనౌత్‌పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. ఆమెతో గొడవ పడాల్సిన అవసరం తనకు లేదని, రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

‘‘ఈ రోజు నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనూ ఇదే అంశాన్ని పోస్ట్ చేశాను. ‘కంగనా.. కాస్త ప్రశాంతంగా ఉండండి.. కూర్చుని మాట్లాడుకుందాం’ అని క్యాప్షన్‌ పెట్టాను. ప్రస్తుతం దేశంలో పరస్పర చర్చలు, సంభాషణలు తగ్గిపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన వాతావరణంలో చర్చించుకోవాలి’’ అని పేర్కొన్నారు. కంగనా తన వ్యాఖ్యలను పునఃసమీక్షించుకోవాలని, నేరుగా ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సౌరవ్ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story