Mamata Banerjee: టీఎంసీ నేతలే లక్ష్యంగా కేంద్ర బలగాల దాడులు.. కౌన్సిలర్ ఇంటి ధ్వంసంపై మమతా బెనర్జీ ఆగ్రహం!

Mamata Banerjee: టీఎంసీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర బలగాలు దాడులు చేస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్‌కతాలో కౌన్సిలర్ ఇంటిపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.

Arun Chilukuri
Published on: 29 April 2026 10:55 AM IST
Mamata Banerjee
X

Mamata Banerjee: టీఎంసీ నేతలే లక్ష్యంగా కేంద్ర బలగాల దాడులు.. కౌన్సిలర్ ఇంటి ధ్వంసంపై మమతా బెనర్జీ ఆగ్రహం!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేళ రాజకీయ వేడి రాజుకుంది. అధికార టీఎంసీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర బలగాలు దాడులకు పాల్పడుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పరిస్థితులపై కనీస అవగాహన లేని అధికారులను కేంద్రం ఇక్కడ నియమించిందని ఆమె విమర్శించారు.

గత రాత్రి కోల్‌కతాలో చోటుచేసుకున్న ఓ ఘటనపై ఆమె స్పందిస్తూ.. స్థానిక పోలీసుల సహకారం లేకుండానే 70వ వార్డు కౌన్సిలర్ ఇంటిపై సీఆర్‌పీఎఫ్ సిబ్బంది దాడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో కౌన్సిలర్ ఇంట్లో లేకపోయినప్పటికీ, ఆయన భార్య మరియు చిన్నపిల్ల ఉన్నారనే కనికరం లేకుండా ఇంటిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగాలని తాము కోరుకుంటుంటే, కేంద్రం మాత్రం బలగాలను అడ్డుపెట్టుకుని అలజడి సృష్టిస్తోందని మమత ఆందోళన వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story