Abhijeet Dipke : 'హ్యాపీ స్లీప్'.. అభిజీత్ ఎమోషనల్ వీడియో వైరల్..!
Abhijeet Dipke : నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంలో విద్యార్థుల పక్షాన నిలబడి అలుపెరుగని పోరాటం చేసిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)కి ఎట్టకేలకు బిగ్ విక్టరీ..
abhijeet dipke
Abhijeet Dipke : నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంలో విద్యార్థుల పక్షాన నిలబడి అలుపెరుగని పోరాటం చేసిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)కి ఎట్టకేలకు బిగ్ విక్టరీ దక్కింది. ఉద్యమ నాయకుడు, సిజెపి వ్యవస్థాపకుడు 29 ఏళ్ల అభిజీత్ దిప్కే నాయకత్వంలో సాగిన ఈ పోరాటానికి దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం, విద్యార్థుల ప్రధాన డిమాండ్లకు అంగీకరించడంతో పాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ వివాదానికి తెరపడింది. ఈ చారిత్రక విజయం తర్వాత అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
37 రోజుల సుదీర్ఘ పోరాటం.. ప్రశాంతంగా నిద్రలేచిన క్షణం
గడిచిన 37 రోజులుగా జంతర్ మంతర్ వద్ద సాగిన నిరసన కాలం అత్యంత కష్టతరంగా సాగిందని దిప్కే గుర్తుచేసుకున్నారు. "రేపు ఉదయానికల్లా ఏమవుతుందో, నెక్స్ట్ ఏం చేయాలనే ఆందోళన ఏమీ లేకుండా, ఇన్ని రోజుల తర్వాత ఈరోజు నా ఇంట్లోనే ప్రశాంతంగా నిద్రలేచే అవకాశం దక్కింది" అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. ఈ విజయం సాధించినంత మాత్రాన ఇక్కడితో ఆగిపోమని, కాక్రోచ్ జనతా పార్టీ ప్రయాణం ఇంకా చాలా దూరం సాగాల్సి ఉందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని తన ఫాలోవర్లకు స్పష్టం చేశారు.
టైఫాయిడ్ జ్వరం ఉన్నా వీడని పట్టుదల.. విమర్శకులకు కూడా థ్యాంక్స్
ఈ సంచలన విజయం అంత సులువుగా ఏమీ దక్కలేదని, ఎన్నో అనుమానాలు, దారుణమైన విమర్శలు ఎదురైనప్పటికీ సిజెపికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం తాను టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నందున జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరినీ నేరుగా కలిసి పర్సనల్‌గా ధన్యవాదాలు చెప్పలేకపోయానని క్షమాపణలు కోరారు.
"37 రోజులుగా జంతర్ మంతర్ వద్ద వీరోచితంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు. మీరు దేశం కోసం చేసిన ఈ పోరాటం నిజంగా అభినందనీయం" అని కొనియాడారు. అంతేకాకుండా తమను విమర్శించిన వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ప్రశ్నలే తమలోని లోపాలను దిద్దుకుని ముందుకు సాగడానికి , ఈ విజయాన్ని సాధించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని అభిజీత్ దిప్కే వ్యాఖ్యానించారు.
CJP Founder @abhijeet_dipke releases a video thanking everyone who made the huge victory of the youth possible.
— Cockroach is Back (@Cockroachisback) July 26, 2026
He also thanks all critics for helping him improve, and eventually deliver on the promise of the Cockroach Janta Party’s first campaign. #ANewDay pic.twitter.com/1JQNozymLo




