Abhijeet Dipke: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. జాతీయస్థాయి పోరుకు సిద్ధమైన కాక్రోచ్‌ జనతా పార్టీ!

Abhijeet Dipke: కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ‘క్యా బోల్తీ పబ్లిక్‌’ పేరిట జాతీయస్థాయి ప్రచారం చేపడుతున్నట్లు ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 6 Aug 2026 4:30 PM IST
Abhijeet Dipke
X

Abhijeet Dipke: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. జాతీయస్థాయి పోరుకు సిద్ధమైన కాక్రోచ్‌ జనతా పార్టీ!

Abhijeet Dipke: విద్యార్థుల నిరసనలతో దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు పొందిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (CJP) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ‘క్యా బోల్తీ పబ్లిక్’ అనే పేరుతో జాతీయస్థాయి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. దేశంలో నాణ్యమైన విద్య సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. "ఒకటో తరగతికే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. కాలేజీ, కోచింగ్ ఫీజుల భారాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చెప్పినట్లుగా విద్య అనేది ప్రాథమిక హక్కు. కానీ గత కొన్నేళ్లుగా అది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఈ పరిస్థితి మారాలి" అని విమర్శించారు.

ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలనుకునే వారి కోసం పార్టీకి సంబంధించిన అధికారిక క్యూఆర్ కోడ్‌లను మీడియా వేదికగా ప్రదర్శించారు. పార్టీ సభ్యత్వం పూర్తిగా ఉచితమని, ఎలాంటి మోసపూరిత చెల్లింపుల విజ్ఞప్తులను నమ్మవద్దని సూచించారు. సీజేపీ ఏ రాజకీయ పార్టీలోనూ చేరకుండా, వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ఒత్తిడి తెచ్చే ఒక ‘ప్రెజర్ గ్రూప్’గా పనిచేస్తుందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story