New Delhi: AIPC జాతీయ చైర్‌పర్సన్‌గా మధుయాష్కి గౌడ్ నియామకం!
New Delhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది
New Delhi: AIPC జాతీయ చైర్‌పర్సన్‌గా మధుయాష్కి గౌడ్ నియామకం!
New Delhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారికి పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్‌పర్సన్‌గా మధుయాష్కి గారిని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ గారు చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రొఫెషనల్స్‌ను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేయడంలో AIPC కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మధు గౌడ్ యాస్కీ గారికి ఈ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటివరకు AIPC చైర్‌పర్సన్‌గా సేవలందించిన శ్రీ ప్రవీణ్ చక్రవర్తి గారు అందించిన సేవలను పార్టీ అభినందించింది. ఆయన నాయకత్వంలో సంస్థకు అందించిన సహకారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రశంసించింది.




