Parlakhemundi: యువతి ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్!
Parlakhemundi: యువతి ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన గజపతి సైబర్ పోలీసులు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన అధికారులు.
Parlakhemundi: యువతి ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్!
Parlakhemundi: ఓ యువతి ఫోటో, వీడియో లను ఇంస్టాగ్రామ్ లో వైరల్ చేసిన కేసులో నిందితుడను గజపతి జిల్లా సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై ఆదివారం సాయంత్రం పర్లాఖెముండి పట్టణ ఆదర్శ ఠాణా ప్రాంతంలో ఉన్న సైబర్ ఠాణా లో అధికారి వివరాలు ఇలా వెల్లడించారు.
జిల్లాలోని రామగిరి ఠాణా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతీ తన ఫోటో వీడియోలను ఓ వ్యక్తి ఇంస్టాగ్రామ్ లో వైరల్ చేసి బెదిరిస్తున్నట్లు ఈనెల 3వ తేదీన ఠాణా లో ఫిర్యాదు చేసిందని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు బాలేశ్వర్ జిల్లా సోరో ఠాణా పరిధిలోని నువాపూర్ గ్రామానికి చెందిన భరత్ కుమార్ మహారాణా (34)గా గుర్తించినట్లు తెలిపారు. యువతి యువకుడు గత రెండేళ్ల క్రితం చెన్నై లో షాపింగ్ మాల్ లో పనిచేస్తూ పరిచయం అయ్యి, అనంతరం ఒక్కటైయ్యరని తెలిపారు.
యువతి తన స్వగ్రామానికి తిరిగి రాగా, పలుమార్లు చెన్నైకి రమ్మని పిలిచాడని వెళ్లకపోవడంతో ఫోటో వీడియోలను వైరల్ చేసినట్లు తెలిపారు. గతంలో ఇంస్టాగ్రామ్ ఐడి తొలగించినప్పటికీ, తప్పుడు పేర్లతో ఐడీలను సృష్టించి మరల వైరల్ చేసినట్లు వివరించారు. దీంతో నిందితుడని తన స్వగ్రామంలో ఆదివారం ఉదయం అరెస్టు చేసినట్లు, దర్యాప్తు అనంతరం కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు.




