Rajnath Singh: యువతను పావులుగా వాడుకుంటున్నారు.. కాంగ్రెస్ అజెండాపై రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
Rajnath Singh: కాంగ్రెస్, విపక్షాల ఆందోళనలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్. బంగ్లాదేశ్ తరహా పాలన మార్పు కోసం కుట్రలు చేస్తున్నారని విమర్శ.
Rajnath Singh: యువతను పావులుగా వాడుకుంటున్నారు.. కాంగ్రెస్ అజెండాపై రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
Rajnath Singh: దేశంలో గందరగోళం, అరాచకం సృష్టించడానికి ప్రజాస్వామ్యం ఎలాంటి లైసెన్స్ ఇవ్వదని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు యువ శక్తిని పావులుగా వాడుకుంటూ దేశంలో అరాచకాన్ని వ్యాప్తి చేస్తున్నాయని మండిపడ్డారు.
బంగ్లాదేశ్లో జరిగినట్లుగా ఇక్కడ కూడా పాలన మార్పు కావాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కోరుకుంటున్నాయని రక్షణమంత్రి ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చేయడమే లక్ష్యంగా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారని విమర్శించారు.
యువతను దేశాభివృద్ధి వైపు నడిపించాల్సింది పోయి, రాజకీయ ఘర్షణలు రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ వాడుకుంటోందని మండిపడ్డారు. విపక్షాల ఏకైక అజెండా ప్రజాస్వామ్య సంస్థలను కూల్చివేయడమేనని స్పష్టం చేశారు.
విపక్షాల నిరసనలు, ర్యాలీలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను రక్షణమంత్రి సమర్థించారు. శాంతిభద్రతల పరిరక్షణకు చట్టాన్ని గౌరవించడం అత్యవసరమని, రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలిచేయకూడదని హితవు పలికారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇకనైనా ప్రజాతీర్పును గౌరవించి, తన రాజకీయ పాత్రపై ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజ్నాథ్ సింగ్ చురకలంటించారు.




