Delhi Protest : బిగ్ షాకింగ్ న్యూస్.. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో 2500 మందికి పైగా క్రిమినల్స్..
Delhi Protest : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, పౌరులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతల
Delhi-Protest
Delhi Protest : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, పౌరులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నాయి. అయితే, ఈ నిరసనల వాతావరణంలో ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్ జరిపిన ఒక ఆపరేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆందోళన ప్రాంతం చుట్టూ భద్రతను పర్యవేక్షించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన అత్యాధునిక 'ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్' (FRS) కెమెరాలకు ఊహించని షాకింగ్ నిజాలు చిక్కాయి.
ధర్నా జరుగుతున్న పరిసరాల్లో తిరుగుతున్న దాదాపు 2,500 మందికి పైగా క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులను ఈ హైటెక్ డిజిటల్ సిస్టమ్ పక్కాగా ఐడెంటిఫై చేసినట్లు అధికార వర్గాలు పిటిఐ (PTI) వార్తా సంస్థకు వెల్లడించారు. విద్యార్థుల ఆందోళనలను, భారీ జనసమీకరణను ఆసరాగా చేసుకుని అల్లర్లు రేపడానికి లేదా శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించడానికి ప్రయత్నించే ముఠాలకి ముందే చెక్ పెట్టేందుకే ఈ డిజిటల్ నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద 'థర్డ్ ఐ'.. ఎలా పనిచేస్తుందంటే?
జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు వచ్చే, వెళ్లే అన్ని ప్రధాన ఎంట్రీ , ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) యూనిట్లను ప్రత్యేకంగా అమర్చారు. ఈ కెమెరాలు సాధారణ సెక్యూరిటీ కెమెరాల్లా కాకుండా, నేరుగా ఢిల్లీ పోలీస్ మెయిన్ సెంట్రల్ డేటాబేస్‌తో రియల్ టైమ్‌లో కనెక్ట్ అయి పనిచేస్తాయి. ఈ కెమెరాల క్వాలిటీ అండ్ రేంజ్ ఏ స్థాయిలో ఉందంటే.. చాలా దూరంలో ఉన్న వ్యక్తి ముఖాన్ని కూడా క్షణాల్లో హై-రెజల్యూషన్ పిక్చర్‌గా క్యాప్చర్ చేయగలవు. అలా క్యాప్చర్ చేసిన ఫేస్ కట్‌ను వెంటనే పోలీస్ డిపార్ట్‌మెంట్ దగ్గరున్న పాత రికార్డులతో కంపేర్ చేసి, అతనికి ఏమైనా క్రిమినల్ కనెక్షన్లు ఉన్నాయా లేదా అనేది కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే తేల్చేస్తుంది.
రికార్డుల్లో ఉన్న 'బ్యాడ్ క్యారెక్టర్లు'.. పోలీసుల హిట్ లిస్ట్
ఢిల్లీ పోలీస్ వద్ద ఉన్న పోలీస్ రికార్డుల ప్రకారం.. తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్న వాంటెడ్ నేరస్థులు, వివిధ కేసుల్లో కోర్టుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న పరారీలో ఉన్నవారు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు , పోలీసు రికార్డుల్లో "బ్యాడ్ క్యారెక్టర్లు" (BCs)గా నమోదైన పాత నేరస్థులను ఈ సిస్టమ్ చాలా సులువుగా పసిగడుతోంది.
ఒకవేళ ఏ అనుమానితుడైనా లేదా పాత క్రిమినల్ అయినా ఈ కెమెరాల కంటపడితే, ఆ విషయాన్ని సిస్టమ్ వెంటనే గుర్తించి స్పాట్‌లో ఉన్న సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ టీమ్స్‌కి అలర్ట్ సందేశాన్ని పంపుతుంది. దాంతో ఏమాత్రం ఆలస్యం లేకుండా స్పాట్‌లోనే వారిని కస్టడీలోకి తీసుకోవడం లేదా ఆందోళన ప్రాంతం నుంచి బయటకు పంపించి చట్టపరమైన చర్యలు చేపట్టడం పోలీసులకు చాలా సులభమవుతోంది.
సాధారణ నిరసనకారుల కోసం కాదు.. స్పష్టం చేసిన అధికారులు
అయితే ఈ అత్యాధునిక ఎఫ్‌ఆర్‌ఎస్ కెమెరాల మోహరింపు కేవలం నేరస్థుల నిర్మూలన , అల్లర్ల నిరోధం కోసమేనని, శాంతియుతంగా తమ డిమాండ్ల కోసం పోరాడుతున్న సాధారణ విద్యార్థులను లేదా పౌరులను భయపెట్టడానికి కాదని పోలీస్ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు.
"పెద్ద ఎత్తున జనం గుమిగూడే ఇలాంటి ఆందోళనలను ఆసరాగా చేసుకుని కొందరు అల్లరి మూకలు, పాత నేరస్థులు నిరసనకారుల మధ్యలోకి చొరబడే ప్రమాదం ఉంది. వారు రసాభాస సృష్టించి, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేయడం లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వంటివి చేస్తుంటారు. అలాంటి సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి నిజమైన నిరసనకారులను, సాధారణ పౌరులను కాపాడటానికే ఈ ప్రివెంటివ్ సెక్యూరిటీ ప్లాన్ చేశాం" అని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వివరించారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఈ డిజిటల్ నిఘా కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతోంది.




