Woman With Boyfriend: పెళ్లైన నాలుగో రోజే ప్రియుడితో మెట్రోలో రొమాన్స్.. భర్త ఏం చేశాడంటే..?
Woman With Boyfriend: ఢిల్లీ మెట్రోలో పెళ్లైన నాలుగు రోజులకే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి హద్దులు దాటి ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Woman With Boyfriend: పెళ్లైన నాలుగో రోజే ప్రియుడితో మెట్రోలో రొమాన్స్.. భర్త ఏం చేశాడంటే..?
Delhi Metro: నేటి డిజిటల్ యుగంలో సంబంధాలు, బంధాల విలువలు మారుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు సమాజంలో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. 30 నుండి 40 ఏళ్ల వయసున్న వారిలోనే కాకుండా.. పెళ్లైన కొత్తలోనే పాత ప్రేమను వెతుక్కుంటూ వెళ్లే ధోరణి నేటి యువతలో ఎక్కువవుతోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కాలేజీ రోజుల్లో ప్రేమించుకుని, తల్లిదండ్రుల ఒత్తిడికో, మరే ఇతర కారణాల వల్లో వేరే వాళ్లను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత జీవిత భాగస్వామిని మోసం చేస్తున్న ఘటనలు తరచూ వింటున్నాం. తాజాగా ఢిల్లీ మెట్రో వేదికగా జరిగిన ఇలాంటి ఒక షాకింగ్ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మెట్రోలో హద్దులు దాటిన ప్రయాణం
పెళ్లయి కేవలం నాలుగు రోజులే అవుతోంది. కొత్త పెళ్లికూతురు ఇంట్లో ఉండాల్సిన ఆ మహిళ, తన పాత ప్రియుడిని కలుసుకుంది. ఇద్దరూ కలిసి ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో బహిరంగ ప్రదేశం అనే విచక్షణ కూడా మరచిపోయారు. చుట్టూ జనం ఉన్నారనే విషయాన్ని పక్కనబెట్టి ఒకరినొకరు ముద్దాడటంతో పాటు హద్దులు దాటి ప్రవర్తించారు. మెట్రోలో ఉన్న కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డ్ చేయడంతో, ఆ వీడియో కాస్తా క్షణాల్లో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది.
వీడియో చూసి భర్త షాక్.. కట్ చేస్తే
ఈ వైరల్ వీడియో కాస్తా పెళ్లి చేసుకున్న భర్త కంట పడింది. పెళ్లైన నాలుగు రోజులకే తన భార్య మరొకరితో అలా క్లోజ్‌గా ఉండటం చూసి సదరు భర్త తీవ్ర వేదనకు లోనయ్యాడు. నమ్మి పీటలపై కూర్చున్నందుకు తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను శాశ్వతంగా విడిచిపెట్టేసి, తన దారి తాను చూసుకున్నాడు. ఒకరినొకరు మోసం చేసుకుంటూ బతకడం కంటే విడిపోవడమే మేలని ఆయన భావించాడు.




