Delhi: దిల్లీలో దారుణం.. స్నేహితుల వెంట వెళ్లిన మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్..

Delhi: దిల్లీలోని స్వరూప్‌ నగర్‌లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు.

Arun Chilukuri
Published on: 18 Sept 2026 12:14 PM IST
Delhi
X

Delhi: దిల్లీలో దారుణం.. స్నేహితుల వెంట వెళ్లిన మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్..

Delhi: దేశ రాజధాని దిల్లీలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నమ్మి స్నేహితుల వెంట వెళ్లిన ఓ మైనర్ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడిని కలిసేందుకు కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఆ స్నేహితుడితో పాటు అతనికి తెలిసిన మరో ముగ్గురు మైనర్లు కలిసి ఒక టెంపోలో ప్రయాణించారు. ఆ వాహనంలోనే వారంతా మద్యం తాగి, ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత విషయం బయటపడుతుందనే భయంతో నిందితులు బాలికను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని ఉత్తర దిల్లీలోని స్వరూప్‌ నగర్ ప్రాంతంలోని ఓ పొలాల్లో పడేశారు.

సెప్టెంబర్ 13న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే, అప్పటికే మృతదేహం కుళ్లిపోయి, అమ్మాయిదో అబ్బాయిదో గుర్తించలేని స్థితికి చేరుకుంది. అంతేకాకుండా, శరాన్ని కుక్కలు పీక్కుతినడంతో ఒక చేయి శరీరం నుంచి వేరుపడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక రోజూ ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు మొదట్లో ఫిర్యాదు చేయలేదని తెలిసింది.

స్థానికులు ఇచ్చిన సమాచారం మరియు సీసీటీవీ క్లిప్పింగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ టెంపోను గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మైనర్లు ఉండగా, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.