Delimitation 2026: ఏపీలో 263, తెలంగాణలో 179.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!
Delimitation 2026: దేశ వ్యాప్తంగా పార్లమెంట్.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ఆలోచన చేస్తుంది.
Delimitation 2026: ఏపీలో 263, తెలంగాణలో 179.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!
Delimitation 2026: దేశ వ్యాప్తంగా పార్లమెంట్.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ఆలోచన చేస్తుంది. దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతుంది. లోక్‌సభ సీట్లతో పాటు.. అసెంబ్లీ స్థానాలను భారీగా పెంచాలని కేంద్రం యోచిస్తుస్తుంది. ఏన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను దాదాపు 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి చేరనున్నాయి. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 4,123 నుంచి 6,185కి పెరగనున్నాయి.
2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మహిళలకు 33 శాతం కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ లోనే ఇందుకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
ఇవాళ జరగనున్న సభా వ్యవహరాల సలహా కమిటీ సమావేశంలో ఈ బిల్లుల గురించి ప్రస్తావించవచ్చని తెలుస్తుంది. ఈ బిల్లు ఆమోదం కోసం శని, ఆదివారాలు కూడా పార్లమెంట్ సమావేశాలు జరిపించాలని.. అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను ఏప్రిల్ రెండు నుంచి మరో వారం రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తుంది,.
కేంద్రం తీసుకోనున్న నిర్ణయంతో ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న నియోజకవర్గాల్లో 50 శాతం అదనంగా నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఫలితంగా లోక్‌సభ సభ్యుల సంఖ్య 816కు చేరే అవకాశం ఉంది. 816 సీట్లయితే అందులో అందులో 273 సీట్లు మహిళలకు రిజర్వు కానున్నాయి
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో లోక్‌సభ సీట్లు 25 లేదా 26కు.. అసెంబ్లీ సీట్లు 178 లేదా 179కి పెరిగే అవకాశాలున్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 25 నుంచి 37 లేదా 38కి , అసెంబ్లీ స్థానాలు 262 నుంచి 263కు పెరగనున్నాయి.




