Parlakhemundi: ఆలయ నిర్మాణానికి రూ.1.01 లక్షల విరాళం అందజేసిన దాతలు!

Parlakhemundi: ఒడిశా గజపతి జిల్లా పర్లాకిమిడి రాజా వీధిలో నిర్మిస్తున్న శ్రీ జగన్నాథ మందిర నిర్మాణానికి దాతలు విరాళాలు అందించారు.

ANIL, VIZAG CITY
Published on: 16 Sept 2026 4:35 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: ఆలయ నిర్మాణానికి రూ.1.01 లక్షల విరాళం అందజేసిన దాతలు!

పర్లాఖెముండి: పర్లాఖెముండి పట్టణంలోని రాజా వీధిలో నూతనంగా నిర్మిస్తున్న జగన్నాథ మందిరానికి పలువురు దాతలు విరాళాలు అందజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గుసాని సమితి కేరండి గ్రామానికి చెందిన దాత నరేంద్ర కుమార్ పాత్ర్ రూ 50 వేలు, కోరాపుట్ జిల్లా బొరిగుమ్మ ప్రాంతానికి చెందిన బిజయనంద గంతాయత్ రూ 51 వేలు విరాళాలు అందజేశారు.

అనంతరం దాతలు మాట్లాడుతూ మందిర నిర్మాణానికి ఎంతో మంది దాతలు విరాళాలు అందజేస్తున్నారని , ఇలాంటి దైవ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

ANIL, VIZAG CITY

ANIL, VIZAG CITY