Ashok Mittal: రాజ్యసభలో పదవి దక్కిన కొద్దిరోజులకే.. ఆప్ ఎంపీకి ఈడీ షాక్!

Ashok Mittal: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిత్తల్ నివాసం మరియు కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది.

Arun Chilukuri
Updated on: 15 April 2026 3:42 PM IST
Ashok Mittal
X

ED Raids: రాజ్యసభలో పదవి దక్కిన కొద్దిరోజులకే.. ఆప్ ఎంపీకి ఈడీ షాక్!

Ashok Mittal: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) వ్యవస్థాపకుడు అశోక్ కుమార్ మిత్తల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.

అశోక్ మిట్టల్ నివాసంతో పాటు ఆయనకు చెందిన లవ్లీ గ్రూప్ కార్యాలయాలు, ఇతర వ్యాపార సంస్థల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. విదేశీ లావాదేవీల్లో జరిగిన అవకతవకలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఈ దాడులు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల రాజ్యసభలో ఆప్ ఉపనేతగా ఉన్న రాఘవ్ చద్దాను తొలగించి, ఆ బాధ్యతలను అశోక్ మిత్తల్‌కు పార్టీ అప్పగించింది. పార్లమెంటులో కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తే బాధ్యతను ఆయనకు అప్పగించిన కొద్ది రోజుల్లోనే ఈ ఈడీ దాడులు జరగడం గమనార్హం. దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలు అభివర్ణిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story