Delhi: ఎల్ నినో ప్రమాద ఘంటికలు భారత్‌లో తీవ్ర వర్షాభావం, కరువు హెచ్చరిక!
Delhi: ఎల్ నినో ప్రభావంతో భారత్‌లో తీవ్ర వాతావరణ వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తాగునీటి ఎద్దడి, కరువు ముప్పు.
Delhi: ఎల్ నినో ప్రమాద ఘంటికలు భారత్‌లో తీవ్ర వర్షాభావం, కరువు హెచ్చరిక!
Delhi: ఎల్ నినో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నవంబరు డిసెంబర్ నెలల్లో భారతదేశంలో తీవ్రమైన వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తాయని సైంటిస్టులు హెచ్చరించారు.
ఫలితంగా భారత్ లోని అనేక నగరాల్లో తీవ్ర స్థాయిలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తీవ్రమైన వేడిగాలులు, కరువు పరిస్థితులు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఎల్ నినోప్రపంచాన్ని వణికిస్తున్న మాట.ఇప్పటికే భారతదశంలోని అనేక ప్రాంతాల్లో ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం కారణంగా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.అయితే డిసెంబర్ నెల నాటికి ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రం కానున్నదని సైంటిస్టులు అంటున్నారు.దీని కారణంగా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురవని పరిస్థితులు ఏర్పడతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో నవంబరు డిసెంబర్ నాటికి మరింత తీవ్రమైన రూపం దాల్చబోతోంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్ లెవెల్స్ ఊహకందని రీతిలో విపరీతంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
అంతేకాదు ఇప్పటికే సముద్ర ఉపరితల టెంపరేచర్స్ అసాధారణ రీతిలో పెరిగినట్లు సైంటిస్టులు వెల్లడించారు. వాస్తవానికి ప్రపంచానికి ఎల్ నినో కొత్త కాదు. గతంలో 1982, 1997 అలాగే 2015 సంవత్సరాల్లో వచ్చింది. అయితే అప్పటి పరిస్థితులతో పోలిస్తే, ఈ ఏడాది రాబోయే ఎల్ నినో మరింత శక్తివంతంగా ఉంటుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
అంతేకాదు భారతదేశంపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరించారు.వాతావరణంలో జరిగే ఈ అసాధారణ మార్పుల వల్ల వర్షాకాలం ప్రభావం తగ్గి, రాబోయే రోజుల్లో తీవ్రమైన వేడిగాలులు, కరువు పరిస్థితులు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు భారత్ లోని అనేక నగరాల్లో తీవ్ర స్థాయిలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం, తాగునీటి వనరులు అలాగే విద్యుత్ రంగాలపై ఎల్ నినో ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందన్నది సైంటిస్టులు చెబుతున్న మాట.ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఇందులో భాగంగా నీటి వనరులను సంరక్షించుకోవాలన్నారు.అలాగే సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ జల వనరులను బలోపేతం చేయాలని సూచించారు.
ఎల్ నినో ప్రభావం కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కాగా ఇప్పటికే భారతదేశంలో 13 శాతం రుతుపవన వర్షపాతం లోటు ఉంది. దీనికి ప్రధాన కారణం, జూన్లో ఏర్పడిన తీవ్ర వర్షపాత లోపం, ఆ తర్వాత జులై, ఆగస్టు నెలల్లో అస్థిరంగా, అంతరాయాలతో కూడిన వర్షాలు కురవడం.
ఇక్కడ ఉన్న అసలు సమస్య ఏమిటంటే, ఒక ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు కురిసి వరదలు సంభవిస్తుండగా, మరికొన్ని చోట్ల తీవ్ర వర్షపాత లోటు ఉంది. ఇది వ్యవసాయం, నీటి వనరుల పునరుద్ధరణపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అలాగే మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి వరదలు ముంచెత్తే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రాబోయే కొన్ని నెలలు భామి వాతావరణానికి అత్యంత తీవ్రమైన పరీక్ష ఎదురు కానుంది.




