Diesel and Cng Autos : సీఎన్‌జీ, పెట్రోల్ ఆటోలు ఇక కనిపించవు

Diesel and Cng Autos : ఢిల్లీ-NCR పరిధిలో కాలుష్యాన్ని అదుపు చేసేందుకు CAQM మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Naresh.k
Published on: 16 May 2026 7:38 AM IST
Diesel and Cng Autos
X

Diesel and Cng Autos : సీఎన్‌జీ, పెట్రోల్ ఆటోలు ఇక కనిపించవు

Delhi pollution : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అనేది దశాబ్దాలుగా ఒక తీరని శాపంగా మారింది. ప్రతి శీతాకాలం వచ్చిందంటే చాలు.. విషపూరిత పొగమంచు మధ్య ఉక్కిరిబిక్కిరి కావడం ఇక్కడి ప్రజలకు నిత్యకృత్యమైపోయింది. అయితే, ఈ భయంకర పరిస్థితికి శాశ్వతంగా చరమగీతం పాడేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ మూడు అత్యంత కఠినమైన, విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంది. మీరు ఢిల్లీ లేదా దాని పరిసర నగరాల్లో నివసిస్తుంటే, రాబోయే రోజుల్లో మీ రోజువారీ ప్రయాణం నుండి వాణిజ్య మార్కెట్ వరకు ప్రతిదాన్నీ ఈ కొత్త నిబంధనలు పూర్తిగా మార్చబోతున్నాయి.

నో పీయూసీ.. నో ఫ్యూయల్

చాలామంది వాహనదారులు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంటారు. పోలీసులు పట్టుకుంటే చూద్దాం అనే ధీమాకు చెక్ పెడుతూ, వచ్చే అక్టోబర్ 1, 2026 నుండి మొత్తం NCR పరిధిలో నో పీయూసీ, నో ఫ్యూయల్ నిబంధన అమలులోకి రానుంది. మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకపోతే, పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయడానికి నిరాకరిస్తారు. అంటే, బండి నడవాలంటే కాలుష్య తనిఖీ తప్పనిసరి చేశారన్నమాట.

డీజిల్, సీఎన్‌జీ ఆటోలకు నో ఎంట్రీ

వాణిజ్య వాహనాల కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు త్రీ-వీలర్ల మార్కెట్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ వైపు మళ్లించే రోడ్‌మ్యాప్ సిద్ధమైంది. జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కొత్త పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ ఆటోల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేస్తారు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే అనుమతి ఉంటుంది. ఇదే నియమం 2028 జనవరి 1 నుండి నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ వంటి నగరాలకు, 2029 జనవరి 1 నాటికి మిగిలిన మొత్తం ఎన్‌సిఆర్‌కు వర్తిస్తుంది.

పంట వ్యర్థాల దహనానికి పాతర

శీతాకాలంలో పొరుగు రాష్ట్రాల్లో పంట గడ్డిని తగులబెట్టడం వల్ల వచ్చే పొగ ఢిల్లీని గ్యాస్ ఛాంబర్‌లా మారుస్తుంది. దీనికి పరిష్కారంగా CAQM దిశ సంఖ్య 99ని తెచ్చింది. దీని ప్రకారం ప్రత్యేక పంట గడ్డి పరిరక్షణ దళం రంగంలోకి దిగుతుంది. ప్రతి పొలాన్ని డిజిటల్‌గా మ్యాప్ చేసి, నోడల్ అధికారులను నియమిస్తారు. 2026 వరి కోత సీజన్ నాటికి ఈ దహన ఘటనలను సున్నాకి తీసుకురావడమే లక్ష్యం.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story