జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత.. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు!
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత.. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు!
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. కాగా, ఈ ఆపరేషన్‌లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి.
కుల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ కాల్పుల్లో గాయపడిన ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన కుల్గామ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని చుట్టుముట్టాయి. ఘటనా స్థలంలో మరికొందరు ఉగ్రవాదులు దాగి ఉండవచ్చన్న అనుమానంతో అదనపు బలగాలను రప్పించి ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.




