Parlakhemundi: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి: ఎమ్మెల్యే రూపేష్
Parlakhemundi: పర్లాఖెముండి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, వేసవికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని పీహెచ్‌ఈడీ అధికారులను ఎమ్మెల్యే రూపేష్ ఆదేశించారు.
Parlakhemundi: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి: ఎమ్మెల్యే రూపేష్
పర్లాఖెముండి: గజపతి జిల్లా.. పర్లాఖెముండి పట్టణంలోని బజారు కూడలి ప్రాంతంలో ఉన్న ప్రజా ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి శనివారం సందర్శించారు. అనంతరం సంబంధిత శాఖ ఇంజనీరు అభిషేక్ పురోహిత్ తో మాట్లాడుతూ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
అదేవిధంగా రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక రచించాలని కోరారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నూతనంగా నిర్మిస్తున్న నీళ్ల ట్యాంకును పరిశీలించారు. ఆయన వెంట పురపాలక అధ్యక్షురాలు నిర్మల శెఠి, పురపాలక కార్య నిర్వహణ అధికారి లక్ష్మణ్ ముర్ము తో పాటు ఉపాధ్యక్షుడు లెంక మధు తదితరులు పాల్గొన్నారు.




