EPFO Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 2025-26 వడ్డీ రేట్లు ఇవే.. మీ వడ్డీని ఇలా లెక్కేసుకోండి!
EPFO Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ఖరారు చేసిన ఈపీఎఫ్ఓ (EPFO). అసలు మీ పీఎఫ్ సొమ్ముపై వడ్డీని ప్రతి నెలా ఎలా లెక్కిస్తారు? మీ అకౌంట్లో ఎంత డబ్బు జమ అవుతుంది? అనే పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
EPFO Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 2025-26 వడ్డీ రేట్లు ఇవే.. మీ వడ్డీని ఇలా లెక్కేసుకోండి!
EPFO Interest Rate: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీ రేట్లను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) పీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీని అందించాలని సీబీటీ నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న వడ్డీ రేటునే ఈసారి కూడా కొనసాగించడం విశేషం. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలపడమే తరువాయి.. ఆ వెంటనే వడ్డీ మొత్తం చందాదారుల ఖాతాల్లో జమ కానుంది. ఇంతకీ వడ్డీ లెక్కింపు ఎలా జరుగుతుందో మీకు తెలుసా..
వాస్తవానికి, వడ్డీని ప్రతి నెలా లెక్కిస్తారు కానీ, ఆర్థిక సంవత్సరం చివరలో (మార్చి 31 తర్వాత) ఒకేసారి ఏకమొత్తంగా అకౌంట్‌లో జమ చేస్తారు. ఇక్కడ 'కాంపౌండింగ్' పద్ధతి పని చేస్తుంది కాబట్టి, మీ బ్యాలెన్స్ పెరిగే కొద్దీ వడ్డీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు మీ పీఎఫ్ ఖాతాలో ఏప్రిల్ నెల చివరి నాటికి రూ.2 లక్షల బ్యాలెన్స్ ఉందనుకుందాం. అప్పుడు మీకు వచ్చే వడ్డీ ఇలా ఉంటుంది. 2,00,000 * 8.25% /12. మీకు వచ్చే వడ్డీ మొత్తం రూ.1,375. ఈ మొత్తం వడ్డీని మే నెల ప్రారంభ బ్యాలెన్స్‌కు జోడిస్తారు. ఇలా 12 నెలల పాటు లెక్కించి, ఏడాది చివరలో మీ ఖాతాలో క్రెడిట్ చేస్తారు. మీ పీఎఫ్ ఖాతాలో నిధులు ఎంత ఎక్కువగా ఉంటే, ప్రభుత్వం అందించే ఈ 8.25% వడ్డీ ద్వారా మీకు అంత ఎక్కువ లాభం వస్తుంది.




