Parlakhemundi: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత: అదనపు కలెక్టర్
Parlakhemundi: పర్లాఖెముండిలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు; బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, పరిశ్రమల యజమానులు సహకరించాలని పిలుపునిచ్చారు.
Parlakhemundi: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత: అదనపు కలెక్టర్
పర్లాఖెముండి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అదనపు కలెక్టర్ ఫాల్గుణ మాఝి అన్నారు. శనివారం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లా యంత్రాంగం , కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫాల్గుణ మాఝి, గంజాం జిల్లా బ్రహ్మపుర డివిజనల్ కార్మిక శాఖ కమిషనర్ బాబు చరణ్ పాత్ర్, అదనపు ఎస్పీ బిరంచి బాగ్, న్యాయ సేవల అథారిటీ కార్యదర్శి బిమల్ రౌళ్ తో పాటు జిల్లాలోని వివిధ పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.
కమిషనర్ బాబు చరణ్ పాత్ర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలన్నారు. చదువుకోవాల్సిన వయసులో వారితో ఉపాధి కోసం కఠినమైన పనులు చేయించడం నేరమని తెలిపారు.
అలా ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. న్యాయ సేవల అథారిటీ కార్యదర్శి బిమల్ రౌళ్ బాల కార్మికుల చట్టాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి మానస్ రంజాన్ సాహు, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.




