Karnataka: సెలైన్ బాటిల్‌లో విషం ఇచ్చి మాజీ సైనికుడి హత్య.. ప్రియుడి సోషల్ మీడియా పోస్ట్‌తో దొరికిపోయారు!
Karnataka: కర్ణాటక బెళగావిలో దారుణం చోటుచేసుకుంది. రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల కోసం భర్తను విషమిచ్చి చంపేసింది ఓ భార్య.
Karnataka: సెలైన్ బాటిల్‌లో విషం ఇచ్చి మాజీ సైనికుడి హత్య.. ప్రియుడి సోషల్ మీడియా పోస్ట్‌తో దొరికిపోయారు!
Karnataka: మొదట సాధారణ బైక్ ప్రమాదం.. ఆ తర్వాత గుండెపోటుతో మృతి.. కట్ చేస్తే రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం భార్య, ఆమె ప్రియుడు కలిసి డాక్టర్లతో కలిసి ఆడిన మైండ్ బ్లోయింగ్ మర్డర్ ప్లాన్ ఇది! కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగుచూసిన మాజీ సైనికుడి (Ex-Army Man) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ దారుణ హత్య ఉదంతంలో మృతుడి భార్య, ఆమె ప్రియుడితో పాటు నివేదికలు తారుమారు చేసిన వైద్యులు, ఫోరెన్సిక్ సిబ్బంది సహా మొత్తం 9 మందిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. మాజీ సైనికుడు సందీప్ మంజర్గి మార్చి 13న బైక్‌పై నుంచి జారిపడి స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స కోసం అతని భార్య సుమ మంజర్గి మొదట హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత ఘటప్రభలోని జేజీ ఆసుపత్రికి తరలించింది. అయితే, మార్చి 15న సందీప్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా గుండెపోటు వల్లే మరణం సంభవించిందని తేలింది.
ఆరోగ్యంగా ఉండే సందీప్ చిన్న ప్రమాదానికే అకస్మాత్తుగా ఎలా చనిపోతాడనే అనుమానం పోలీసులకు వచ్చింది. ఇదే సమయంలో సుమ ప్రియుడైన పుండలీక్ దొంబార్ సోషల్ మీడియాలో.. "ప్రమాదానికి గురైన వ్యక్తి అకస్మాత్తుగా ఎలా చనిపోయాడు?" అంటూ ఓ అనుమానాస్పద పోస్ట్ పెట్టాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు పుండలీక్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో రూ. 2 కోట్ల మర్డర్ మిస్టరీ గుట్టు వీడింది.
గతంలో సందీప్, పుండలీక్ కలిసి హోటల్ వ్యాపారం చేశారు. ఈ క్రమంలోనే సందీప్ భార్య సుమతో పుండలీక్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే సమయంలో సందీప్ పేరు మీద సుమారు రూ. 2 కోట్ల విలువైన మూడు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నట్లు వారు గుర్తించారు. ఆ డబ్బును కాజేయాలనే ప్లాన్‌తో, ఆసుపత్రిలో సందీప్ చికిత్స పొందుతున్న సమయంలో సుమ, పుండలీక్ కలిసి సెలైన్ బాటిల్ ద్వారా విషాన్ని, నిద్రమాత్రలను ఎక్కించి నరనరాల్లో విషం పాకేలా చేసి చంపేశారు.
ఈ హత్యను గుండెపోటుగా నమ్మించేందుకు నిందితులు డాక్టర్ బసవరాజ్, ఎఫ్‌డీఏ అధికారి అశోక్, ఎఫ్‌ఎస్‌ఎల్ క్లర్క్ అప్పాసాహెబ్‌లకు రూ. 3 లక్షలకు పైగా లంచం ఇచ్చి ఫోరెన్సిక్ నివేదికలను తారుమారు చేయించారు. నిందితుల నుంచి విషం సీసాలు, సిరంజిలు స్వాధీనం చేసుకుని 9 మందిని రిమాండ్‌కు తరలించారు.




