Parlakhemundi: సెంచూరియన్ యూనివర్సిటీలో ముగిసిన AI, మెషిన్ లెర్నింగ్ శిక్షణ కార్యక్రమం!

Parlakhemundi: పర్లాఖెముండి సెంచూరియన్ వర్సిటీలో ఏఐ, మెషిన్ లెర్నింగ్‌పై రెండు వారాల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ముగిసింది.

S.Anil, Gajapati Dst
Published on: 11 Oct 2026 7:24 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: సెంచూరియన్ యూనివర్సిటీలో ముగిసిన AI, మెషిన్ లెర్నింగ్ శిక్షణ కార్యక్రమం!

Parlakhemundi: సెంచూరియన్ విశ్వవిద్యాలయం పర్లాఖెముండి క్యాంపస్‌లో కోర్ ఇంజనీరింగ్ రంగంలో AI, మెషిన్ లెర్నింగ్ అనువర్తనంపై నిర్వహించిన రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అక్టోబర్ 10న ముగిసింది.

జాతీయ సాంకేతిక సంస్థ (NIT) పాట్నా, CUTM సంయుక్త ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో NIT వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ప్రవీణ్ పట్టనాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

CUTM కోఆర్డినేటర్ డా. ప్రజ్ఞా పారమిత ప్రధాన్ స్వాగత ఉపన్యాసం ఇవ్వగా, డీన్ డా. ప్రఫుల్ల కుమార్ పండా, రిజిస్ట్రార్ డా. అనితా పాత్ర ప్రసంగించారు.

అధ్యాపకుల సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు విద్య, పరిశోధనలో AI, మెషిన్ లెర్నింగ్ సమన్వయమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

చివరగా కన్వీనర్ డా. ప్రభాత్ కుమార్ పట్టనాయక్ అతిథులందరికీ, పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst