Delhi: రాహుల్, ప్రియాంక గాంధీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు..!

Delhi: అనుమతి లేకుండా ఆకాశవాణి కార్యాలయంలోకి ప్రవేశించారన్న ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు పలువురు ఎంపీలపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Arun Chilukuri
Updated on: 7 Oct 2026 1:06 PM IST
Delhi
X

Delhi: రాహుల్, ప్రియాంక గాంధీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు..!

Delhi: కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు ఎంపీలపై దిల్లీ పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఆకాశవాణి కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించారన్న ఆరోపణలతో అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.

కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ విపక్షాల 'ఇండియా' కూటమి ఆధ్వర్యంలో మంగళవారం దిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు దిల్లీ పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలు అనూహ్యంగా ఆకాశవాణి భవన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ భవనంలోకి బలవంతంగా ప్రవేశించి కొన్ని గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అనుమతి లేని ప్రవేశం తదితర నిబంధనల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.