నిరసన సెంటర్ లో 'ఫుడ్ వ్లాగ్'.. సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షపై వైరల్ వీడియో.. నెటిజన్లు ఫైర్!
Sonam Wangchuk Hunger Strike: జంతర్ మంతర్ వద్ద క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది.
నిరసన సెంటర్ లో 'ఫుడ్ వ్లాగ్'.. సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షపై వైరల్ వీడియో.. నెటిజన్లు ఫైర్!
Sonam Wangchuk Hunger Strike: జంతర్ మంతర్ వద్ద క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జూన్ 28 నుంచి ఈ దీక్ష కొనసాగుతోంది. అయితే, ఇక్కడ ఒక వైపు సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తుంటే.. అదే నిరసన స్థలంలో ఒక ఫుడ్ వ్లాగర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. నెటిజన్లను రెండు వర్గాలుగా విడగొట్టింది.
"ఆయనొక్కడే ఆకలితో ఉన్నారు.. మిగతావాళ్లంతా కుమ్మేస్తున్నారు!"
ఆయుష్ సప్రా అనే ప్రముఖ ఫుడ్ వ్లాగర్ జంతర్ మంతర్ నిరసన వేదిక వద్దకు వెళ్లి, అక్కడ వాలంటీర్లకు వడ్డిస్తున్న భోజనాన్ని రివ్యూ చేస్తూ వీడియో తీశాడు. అక్కడ చోలే సబ్జీ తింటూ.. "ఇక్కడ చోలే ఉంది, రోటీలు అయిపోయాయి.. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కేవలం సోనమ్ జీ మాత్రమే ఆకలితో ఉన్నారు, మిగతా వాళ్లంతా భోజనాన్ని భర్తీ చేసుకుంటున్నారు (భర భర కే ఖారహే హై)" అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు, తాను తింటున్న సమోసాలు, చట్నీ చూపిస్తూ సోనమ్ వాంగ్‌చుక్‌ను కాస్త ఏడిపించాలని (టీజ్ చేయాలని) ఉందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారానికి దారితీసింది.
సోషల్ మీడియా అటాక్.. "ప్రొటెస్ట్ సైట్‌ను జొమాటో చేసేశావ్!"
ఈ వీడియోపై ఎక్స్ వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"ఒక మనిషి దేశం కోసం, విద్యార్థుల కోసం ప్రాణాలు పణంగా పెట్టి 7 కిలోల బరువు తగ్గాడు. కానీ ఈ వ్లాగర్ మాత్రం అక్కడికి వెళ్లి 'స్వాద్ హీ ఆగయా' (అద్భుతమైన రుచి) అంటున్నాడు. ప్రొటెస్ట్ సైట్‌ను కాస్త జొమాటో సెంటర్ చేసేశాడు. సిగ్గుచేటు" అంటూ ఒక యూజర్ మండిపడ్డారు.
"ఒక ఫుడ్ వ్లాగర్ మాత్రమే 'హంగర్ స్ట్రైక్' (నిరాహార దీక్ష) అని వినగానే.. మెనూలో ఏముందో చూద్దాం అని ఆలోచించగలడు" అంటూ మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు.
మద్దతుగా నిలుస్తున్న సపోర్టర్లు
మరోవైపు, ఈ వీడియో వెనుక ఉన్న పాజిటివ్ కోణాన్ని సపోర్టర్లు ప్రశంసిస్తున్నారు. ఫుడ్ రివ్యూ అనేది ఒక నెపం మాత్రమేనని, కంటెంట్ క్రియేటర్స్ ఎవరూ రాని చోటుకి ఆయుష్ వెళ్లి, యువత చేస్తున్న పోరాటాన్ని, సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో హైలైట్ చేశాడని కొనియాడుతున్నారు. కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కూడా వ్లాగ్‌లో మాట్లాడుతూ.. వ్యవస్థపై నమ్మకం కోల్పోయి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అందుకే ఈ పోరాటం అవసరమని స్పష్టం చేశారు.
18వ రోజుకు దీక్ష.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
ఇదిలావుండగా, సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తుండటంతో ఆయనకు తక్షణమే అత్యవసర వైద్య చికిత్స అందించాలని, ప్రాణాలు కాపాడేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ (PIL) దాఖలైంది. పలువురు ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం ఆయనకు మద్దతు తెలుపుతూ.. ఆరోగ్యం పాడవకముందే దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




