Petroleum Ministry: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!

Petroleum Ministry: ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న వార్తలను ఖండించిన కేంద్రం. లీటరుకు రూ. 25-28 పెరుగుతుందనే ప్రచారంలో నిజం లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత.

Arun Chilukuri
Published on: 23 April 2026 1:23 PM IST
Petroleum Ministry
X

Petroleum Ministry: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!

Petroleum Ministry: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. లీటరుకు రూ. 25 నుండి రూ. 28 వరకు ధరలు పెరగొచ్చని కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది.

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ అంశంపై 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించింది. "పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదు" అని స్పష్టం చేసింది. గత నాలుగేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ఆ భారం సామాన్య ప్రజలపై పడకుండా ప్రభుత్వం మరియు చమురు సంస్థలు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని గుర్తు చేసింది.

కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్ల నుండి 100 డాలర్ల పైకి చేరిన నేపథ్యంలో, ఏప్రిల్ 29న పోలింగ్ ముగిసిన తర్వాత ధరల సవరణ ఉంటుందని ఆ నివేదికలో అభిప్రాయపడింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో కేంద్రం రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ధరల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story