Gadchiroli: గడ్చిరోలిలో ఘనంగా 'మావోయిస్ట్ ముక్త్ దీపావళి' వేడుకలు!

Gadchiroli: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా 'మావోయిస్ట్ ముక్త్ దీపావళి' వేడుకలు. గిరిజనులు, లొంగిపోయిన మావోయిస్టులతో పండుగ జరుపుకున్న ఎస్పీ.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 9 Nov 2026 11:54 AM IST
Gadchiroli
X

Gadchiroli: గడ్చిరోలిలో ఘనంగా 'మావోయిస్ట్ ముక్త్ దీపావళి' వేడుకలు!

Gadchiroli: ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో అశాంతికి నిలయంగా ఉన్న గడ్చిరోలి జిల్లాలో శాంతి, సామరస్య సందేశాన్ని చాటుతూ పోలీసులు ప్రజలతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ‘మావోయిస్టు ముక్త్ దీపావళి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్పీ బినాగుండాలో గిరిజనులు, పోలీసు జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాలోని 70 పోలీస్ స్టేషన్లు, ఔట్ పోస్టులు, పోలీసు కేంద్రాల పరిధిలో ప్రజలకు మిఠాయిలు, టపాసులు పంపిణీ చేశారు.

అలాగే నవజీవన్ కాలనీలో మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన వారితోనూ అధికారులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సేవా సంస్థల సహకారంతో మారుమూల ప్రాంతాల్లోని రైతు కుటుంబాలకు నిత్యావసర సరుకులు, పండుగ తినుబండారాలు అందజేశారు.

భద్రత కల్పించడంతో పాటు ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడం, సామాజిక ఐక్యతను బలోపేతం చేయడం తమ లక్ష్యమని ఎస్పీ ఎం. రమేష్ తెలిపారు. శాంతియుత, అభివృద్ధి చెందిన గడ్చిరోలి నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.