Paralakhemundi: గంగమ్మ చెంతకు లక్ష్మమ్మ: ఘనంగా నిమజ్జనం

Paralakhemundi: పర్లకీముండిలో 7 రోజులపాటు పూజలందుకున్న గజలక్ష్మీ దేవిని మహేంద్రతనయ నదిలో నిమజ్జనం చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి.

S.Anil, Gajapati Dst
Published on: 3 Nov 2026 10:33 PM IST
Paralakhemundi
X

Paralakhemundi: గంగమ్మ చెంతకు లక్ష్మమ్మ: ఘనంగా నిమజ్జనం

పర్లకీముండి: పర్లాభెముండి పట్టణంలోని ఒడియా మంగళ వీధి ప్రాంతంలో 7 రోజులుగా గజలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆదివారం రాత్రి పట్టణ పురవీధుల్లో మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేపట్టారు. అనంతరం మహేంద్రతనయలో నిమజ్జనం చేశారు.

శైవ పీఠాల్లో భక్తుల రద్దీ

కార్తీక మొదటి సోమవారం సందర్భంగా గజపతి జిల్లాలోని శైవ పీఠాల్లో భక్తుల తాకిడి కనిపించింది. మందిర ప్రాంతాలు శివనామ స్మరణతో మారుమోగాయి.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst