Gajapati: గజపతి జిల్లాలో బిజెడి ఆధ్వర్యంలో ఇంటింటా పాదయాత్ర!
Gajapati: గజపతి జిల్లా గుసాని సమితిలో బీజేడీ ఆధ్వర్యంలో జనసంపర్క యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి నేతృత్వంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
Gajapati: గజపతి జిల్లాలో బిజెడి ఆధ్వర్యంలో ఇంటింటా పాదయాత్ర!
Gajapati: బిజు జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పిలుపుమేరకు శుక్రవారం గజపతి జిల్లా గుసాని సమితిలో జనసంపర్క యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో పర్లాఖెముండి నియోజకవర్గ ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు,
గుసాని సమితి అధ్యక్షుడు ఎన్ వీర్రాజు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల సాయమ్మ , జడ్పీ సభ్యుడు ఎస్ బాలరాజు , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గారబంద గ్రామ ప్రాంతంలో పాదయాత్ర ప్రారంభించి సమితి అంతటా పర్యటించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్నికల్లో అమలు చేస్తామన్న హామీలు నెరవేర్చకుండా ప్రజలకు విస్మరించిందని, ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చడంలో విఫలమైందని అన్నారు.
నవీన్ పట్నాయక్ పాలనలో పేద ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలు అమలు చేసిందని గుర్తు చేసుకున్నారు. అధికార పార్టీ తప్పులను ప్రజలకు తెలిపేందుకు ఇంటింటా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు.




