Parlakhemundi: అర్ణబ్ తుఫాను ముప్పు.. గజపతి జిల్లా యంత్రాంగం అప్రమత్తం!
Parlakhemundi: అర్ణబ్ తుఫాను ఎదుర్కొనేందుకు గజపతి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ అక్షయ్ సునీల్, నోడల్ ఆఫీసర్ బిజయ్ దాస్ నేతృత్వంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
Parlakhemundi: అర్ణబ్ తుఫాను ముప్పు.. గజపతి జిల్లా యంత్రాంగం అప్రమత్తం!
Parlakhemundi: అర్నబ్ తుఫానును ఎదుర్కొనేందుకు గజపతి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా నోడల్ అధికారి, రాష్ట్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి బిజయ్ కుమార్ దాస్ అన్నారు. జిల్లాలోని మోహన, ఆర్ ఉదయగిరి, రాయగడ,గుమ్మ, నువాగఢ సమితులలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తుఫాను ను పై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు అన్నారు. అదేవిధంగా కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్,సబ్ కలెక్టర్ భగత్ సమల్ కళ్యాణ రావ్ కాశీనగర్ సమితి వంశధార నది పరివాహక ప్రాంతంలో పరిశీలించి, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.




