Gajapati: గజపతి జిల్లా తుది ఓటరు జాబితా విడుదల!

Gajapati: ఎస్‌ఐఆర్ 2026 తుది ఓటరు జాబితాను రెవెన్యూ ఏడీఎం మునీంద్రా హోన్నాగా విడుదల చేశారు. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,33,952గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

S.Anil, Gajapati Dst
Published on: 22 Sept 2026 8:28 AM IST
Gajapati
X

Gajapati: గజపతి జిల్లా తుది ఓటరు జాబితా విడుదల!

Gajapati: పర్లాఖెముండి పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎస్ఐఆర్ 2026 తుది ఓటరు జాబితాను రెవెన్యూ ఏడీఎం మునీంద్రా హోన్నాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు అమిత్ బిస్వాల్, కీర్తి సాయి శుక్ల తో పాటు మీద పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రెవెన్యూ ఏడీఎం మునీంద్రా మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి సర్వే చేసిన అనంతరం తుది జాబితా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మోహన నియోజకవర్గం లో గతంలో 297 బూత్ లు అదనంగా 70 బూత్ లను కలుపుతూ 367, పర్లాఖెముండి నియోజవర్గంలో గతంలో 296 బూత్ లకు గాను నూతనంగా 46 కలుపుతూ 322 బూత్ లు ఏర్పడ్డాయని తెలిపారు.

రెండు నియోజకవర్గాలు కలిపి 689 బూత్ లు అయ్యాయని అన్నారు. రెండు నియోజకవర్గాలు కలిపి ఓటర్ల సంఖ్య సుమారు4,33,952 గా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ జాబితాలో అభ్యంతరాలు ఉంటే నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చనని వివరించారు.ఈ సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు నబ కిషోర్ సబర్,బిజద జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ నాయక్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బర్నాల జనార్దన రావు తదితరులు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst