Parlakhemundi: పర్లకీముండిలో అక్రమ టేకు దుంగల స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్!

Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లా పర్లకీముండి వద్ద వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 21 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు. ఇద్దరు నిందితుల అరెస్ట్.

S.Anil, Gajapati Dst
Published on: 28 Oct 2026 6:55 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లకీముండిలో అక్రమ టేకు దుంగల స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్!

Parlakhemundi: అక్రమంగా వ్యాన్ లో తరలిస్తున్న టేకు దుంగలను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకుంది.ఏసీఏప్ఓ సైనీ శ్రీ దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం దేవగిరి అటవి సిబ్బంది ఉప్పలాడ-కుజాసింగి గ్రామ మధ్యలో గస్తి ఉన్న సమయంలో ఆ వైపుగా వస్తున్న వ్యాన్ ను అడ్డగించి తనిఖీలు చేపట్టగా టేకు దుంగలు లభ్యమయ్యాయి.

వాహనంలో సుమారు 21 టేకి దుంగలు ఉన్నాయని, నిందితులు గురండి ఠాణా పరిధిలోని బోడో కొత్తూరు పంచాయతీ సరియాపల్లి గ్రామానికి చెందిన పొట్నూరు నారాయణరావు (45), గురండి గ్రామానికి చెందిన బండారి మురళీకృష్ణ (42) గుర్తించినట్లు తెలిపారు .

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst