Gajapati: గజపతి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు: గోషాణిలో 35 మి.మీ

Gajapati: ఒడిశాలోని గజపతి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. గోషాణిలో అత్యధికంగా 35.0 మి.మీ, పర్లకీముండిలో 31.6 మి.మీ వర్షపాతం నమోదైంది.

S.Anil, Gajapati Dst
Published on: 22 Sept 2026 5:11 PM IST
Gajapati
X

Gajapati: గజపతి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు: గోషాణిలో 35 మి.మీ

గజపతి జిల్లా: *పర్లకీముండి నిన్నటి నుండి గజపతి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. 22 సెప్టెంబర్ న జిల్లాలోని 8 వర్షపాత నమోదు కేంద్రాల నుండి మొత్తం 161.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, జిల్లా సగటు వర్షపాతం 20.18 మి.మీగా ఉంది.

జిల్లా అత్యవసర కార్యాలయం, గజపతి రిపోర్ట్ ప్రకారం గోషాణిలో అత్యధికంగా 35.0 మి.మీ మరియు పర్లకీముండి 31.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత రాయగడలో 20.6 మి.మీ, ఆర్.ఉదయగిరిలో 18.0 మి.మీ, కాశీనగర్‌లో 15.8 మి.మీ, నూవాగడలో 15.2 మి.మీ, గుమ్మాలో 15.0 మి.మీ మరియు మోహనలో అత్యల్పంగా 10.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రికార్డ్ అయింది.

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం ప్రభావితమైంది.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst