Parlakhemundi: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్‌తో చాటింగ్.. గజపతి జిల్లాలో యువతి అరెస్ట్!

Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ అకౌంట్ తెరిచి యువతిని బ్లాక్‌మెయిల్ చేసిన 19 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు.

S.Anil, Gajapati Dst
Published on: 24 Oct 2026 7:24 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్‌తో చాటింగ్.. గజపతి జిల్లాలో యువతి అరెస్ట్!

Parlakhemundi: గజపతి జిల్లాలో ఓ యువతిఅబ్బాయిల చాటింగ్ చేసి... ఆపై బ్లాక్మెయిల్ సామాజిక మాధ్యమాలలో నకిలీ ఖాతాలతో ఫోటోలను అప్డేట్ చేసి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడిన ఓ యువతిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ విషయమై డిఎస్పీ అమితాబ్ పండా వివరాలు ఇలా వెల్లడించారు.

రామగిరి ఠాణా పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తేజేశ్వరి నాయక్ (18) ఈనెల 10వ తేదీన ఠాణా లో ఫిర్యాదు చేసిందని ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. తేజేశ్వరితో ఇనిస్టాగ్రామ్ లో ఆదిత్య అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయమై పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి తన నమ్మకాన్ని కూడగట్టుకుని తన సన్నిహిత ఫోటోలు వీడియోలను పంపించేందుకు కోరాడని, పంపించిన అనంతరం ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పాటు తనను చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అదే గ్రామంలోని గౌడ వీధికి చెందిన నందిత మహంకుడో (19) అనే యువతి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. వారిద్దరు ఇరుగుపొరుగు వారు కావడం పాతకక్షలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు విచారణలో తేలిందని వివరించారు. నిందితురాలుపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst