Parlakhemundi: సైబర్ నేరాలపై పర్లాఖెముండిలో పోలీసుల అవగాహన సదస్సు!

Parlakhemundi: పర్లాఖెముండి మున్సిపాలిటీలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సు మోసపోతే 1930కి కాల్ చేయాలన్న డీఎస్పీ అమితాభ్ పండా.

S.Anil, Gajapati Dst
Updated on: 10 Sept 2026 2:50 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: సైబర్ నేరాలపై పర్లాఖెముండిలో పోలీసుల అవగాహన సదస్సు!

Parlakhemundi: పర్లాఖెముండి పట్టణంలోని పురపాలక కార్యాలయంలో బుధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పురపాలక అధ్యక్షురాలు నిర్మల శెఠి, కార్యనిర్వహణ అధికారి లక్ష్మణ్ ముర్ము తో డీఎస్పీ అమితాబ్ పండా, ఇన్స్ స్పెక్టర్ టున సబర్ పాల్గొన్నారు.సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పోలీసు అధికారులు అన్నారు.

డీఎస్పీ అమితాబ్ పండా మాట్లాడుతూ సైబర్‌ నేరాలు బాగా పెరిగాయని, ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.అపరిచితులు ఫోన్‌లకు పంపించే మెసేజ్‌ లింకులను ఓపెన్‌ చేయవద్దన్నారు. విద్యార్థులు సెల్‌ ఫోన్‌లకు దూరంగా ఉండాలన్నారు. పోలీసు శాఖ సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తుందన్నారు.

ఎవరైనా ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతా, ఏటీఎం పిన్‌, ఓటీపీ నెంబర్లు అడిగితే చెప్పవద్దన్నారు . సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే 1930కు , పోలీసులకు సమాచారం అందించాలన్నారు.ప్రజల బలహీనతలే సైబర్‌ నేరగాళ్లకు బలంగా మారిందన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst

Next Story