Parlakhemundi: గజపతి జిల్లాలో 9.7 టన్నుల అక్రమ గంజాయి దహనం!
Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లాలో పోలీసులు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న 9,763.28 కిలోల అక్రమ గంజాయిని సెరగడ ఇన్సినేటర్ సహాయంతో శుక్రవారం దహనం చేశారు.
Parlakhemundi: గజపతి జిల్లాలో 9.7 టన్నుల అక్రమ గంజాయి దహనం!
Parlakhemundi: గజపతి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రిందట మోహన, అడవా, రాణా పరిధిలోని దాడులు చేసి స్వాధీనం చేసుకున్న 9763.28 కిలోల గంజాయిని పోలీసులు శుక్రవారం దహనం చేశారు.
గంజాయిని జిల్లా సెరగడ ప్రాంతంలో ఉన్న ఇన్సినేటర్ యంత్రం సహాయంతో బూడిద చేసినట్లు ఎస్పీ ప్రహ్లాద్ సహాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ ఎస్పీ ప్రదీప్ కుమార్ సాహు, మోహన రాణా అధికారి ఓం నారాయణ పాత్రో, అడవా రాణా అధికారి సంతోష్ కుమార్ బిసోయి తదితరులు పాల్గొన్నారు.




