Parlakhemundi: పర్లాఖెముండిలో ఘనంగా 67వ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
Parlakhemundi: ఒడిశాలోని పర్లాఖెముండి రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో 67వ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు.
Parlakhemundi: పర్లాఖెముండిలో ఘనంగా 67వ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం!
Parlakhemundi: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని బెత్తగూడ వద్ద ఉన్న రిజర్వ్ పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం 67వ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహించారు.
కార్యక్రమంలో ఎస్పీ ప్రహ్లాద్ సహాని మీనా మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన అమర జవాన్ల సేవలు చిరస్మరణీయమని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పోలీసు అధికారులకు పిలుపునిచ్చారు.
పలు ప్రమాదాలు ప్రాణాలను కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు సన్మానించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో రిజర్వ్ పోలీసు అధికారి సుబల్ సోరన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.




