Parlakhemundi: అడవ పరిధిలో 40 కిలోల గంజాయి పట్టివేత!
Parlakhemundi: గజపతి అడవ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల్లో రూ.4 లక్షల విలువైన 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Parlakhemundi: అడవ పరిధిలో 40 కిలోల గంజాయి పట్టివేత!
Parlakhemundi: గజపతి జిల్లా మోహన బ్లాక్ అడవ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి పోలీసుల బృందం పెట్రోలింగ్ జరుపుతుం డగా, డురింగుడ, ముత్తగుడ రోడ్డులో ఒక టీవీ ఎస్ స్కూటీలో గంజాయి బస్తాలు తీసుకువెళు తుండగా పోలీసులు ప్రశ్నించి పట్టుకున్నారు.
పట్టుకున్న రెండు ముచ్చి బస్తాల్లో ఉన్న గం జాయిని మోహన తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రాజేంద్ర కుమార భుయ్యాన్ సమ క్షంలో తూనిక వేయగా 40 కిలోల గంజాయి ఉన్నట్టు నిర్ధారించారు.
మార్కెట్లో దీని విలువ నాలుగు లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన వ్యక్తి అడవ పం చాయతీ ముత్తగుడ గ్రామానికి చెందిన నర్సింగ్ మాలి అలియాస్ లారెన్స్ (48)గా పోలీసులు గుర్తించారు.
అడవ పోలీసు స్టేషన్లో కేసు నం బర్ 193/2026 ఎన్.డి.పి.యస్. చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి, ఒక టీవీఎస్ స్కూటీ, మొబైల్ను స్వాధీనం చేసుకున్నట్టు అడవ పోలీసు అధికారి సంతోష్ బిశోయి తెలియజే శారు. నిందితుడు నర్సింగ్ మాలిని మోహన కోర్టులో గురువారం హాజరు పరిచారు




