Gajapati: పర్లాకిమిడిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
Gajapati: గజపతి జిల్లా పర్లాకిమిడిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి సేవలను హెచ్‌ఎం సనపల వైకుంఠ రావు కొనియాడారు.
Gajapati: పర్లాకిమిడిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
గజపతి జిల్లా: వ్యవహారిక భాష పితామహుడు స్వర్గీయ గిడుగు రామ్మూర్తి పంతులుగారి జన్మదినం ను ఆంధ్రదేశము అంతటా తెలుగు భాష వికాస దినోత్సవం గా జరుపుకుంటారని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సనపల వైకుంఠ రావు గారు అన్నారు.
శ్రీ గిడుగు వారు పర్లాకిమిడి శ్రీ కృష్ణ చంద్ర గజపతి రాజావారి ఆస్థానంలో విధ్వాంసుడిగా చాలా కాలం పని చేశారు, అక్కడి కళాశాలలో ఆచార్యునిగా కూడా విధులు నిర్వర్తించి భాషా పరిశోధనకు నడుము బిగించారు. అందువలన నేడు పర్లాకిమిడి కోటలో గిడుగు వారి జన్మదిన వేడుకలు విద్యార్థులతో నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీ నల్ల తారకరామారావు గారు మాట్లాడుతూ శ్రీ గిడుగు వారు బాల కవి శరణ్యం, కవి చింతామణి, ఆంధ్ర పండిత బిష క్కుల భేషజాలు, వ్యాసావళీ, సవర తెలుగు నిఘంటువు, ఆంధ్ర వైద్య నిఘంటువు మొదలైన గ్రంథములు రాశారని గుర్తు చేశారు.
వీరి రచనల వలన తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, భాష సామాన్య జనావళికి చేరువయ్యిందని తెలిపారు. శ్రీ గిడుగు వారికి బ్రిటిష్ ప్రభుత్వం వారు 'కైజర్ -ఈ హింద్ 'ను ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళా ప్రపూర్ణ బిరుదులను ఇచ్చి సత్కరించారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ,విద్యార్థులు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.




