Global Liver Crisis : యువతపై కాలేయ వ్యాధుల పంజా.. లాన్సెట్ స్టడీలో విస్తుపోయే నిజాలు

Global Liver Crisis : ప్రపంచవ్యాప్తంగా లివర్ వ్యాధులు 150 శాతం పెరిగాయి. 2023 నాటికి 1.3 బిలియన్ల మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఊబకాయం ప్రధాన కారణాలని లాన్సెట్ వెల్లడించింది.

CR Reddy
Published on: 14 April 2026 8:35 AM IST
Global Liver Crisis
X

Global Liver Crisis

Global Liver Crisis : ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో కాలేయ సంబంధిత సమస్యలు ఏకంగా 150 శాతం పెరగడం ఇప్పుడు వైద్యారోగ్య నిపుణులను కలవరపెడుతోంది. ప్రముఖ వైద్య జర్నల్ ద లాన్సెట్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం.. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.3 బిలియన్ల మంది మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్(MASLD) బారిన పడ్డారు. ఇది 1990తో పోలిస్తే 143 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

కాలేయ వ్యాధుల పెరుగుదలకు కారణాలేంటి?

ఈ వ్యాధి ఇంత వేగంగా పెరగడానికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి అని పరిశోధకులు చెబుతున్నారు. పెరిగిన జనాభాతో పాటు పట్టణీకరణ వల్ల శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటివి ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి రేటు మిగతా ప్రపంచంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది.

భవిష్యత్తు గణంకాలు భయాందోళన కలిగిస్తున్నాయి

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) 2023 డేటా ఆధారంగా చేసిన ఈ అధ్యయనం, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య 1.8 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల మరణాల రేటు కొంత వరకు అదుపులో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఇది లివర్ సిరోసిస్ లేదా కాలేయ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

తక్కువ ఆదాయ దేశాల్లో యువతే టార్గెట్

నగరాల విస్తరణ, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు తక్కువ, మధ్య ఆదాయం ఉన్న దేశాల్లోకి వేగంగా చొచ్చుకువస్తున్నాయి. దీని ప్రభావం ఆయా దేశాల్లోని యువతపై స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న వయసులోనే లివర్ దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో అది దేశాల ఆర్థిక వ్యవస్థపై, ప్రజారోగ్యంపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే తక్షణమే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story