Google Maps: గూగుల్ మ్యాప్స్ నమ్మి వెళ్తే గల్లీలో ఇరుక్కుపోయారు.. చివరికి ఏమైందంటే?
Google Maps: గూగుల్ మ్యాప్స్ నమ్మి వెళ్లిన కేరళ యువకుల కారు ఇరుకు సందులో చిక్కుకుపోయింది. కన్యాకుమారి మేలపురం వద్ద స్థానికులు కారును బయటకు తీశారు.
Google Maps: గూగుల్ మ్యాప్స్ నమ్మి వెళ్తే గల్లీలో ఇరుక్కుపోయారు.. చివరికి ఏమైందంటే?
Google Maps: గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్ముకుని ప్రయాణించిన కొందరు యువకులకు ఊహించని అనుభవం ఎదురైంది. కేరళకు చెందిన నలుగురు యువకులు కన్యాకుమారి పర్యటనలో భాగంగా కారు నడుపుతూ ఓ ఇరుకు వీధిలోకి వెళ్లి రెండు ఇళ్ల మధ్య దారుణంగా చిక్కుకుపోయారు. ఆల్కహాల్ మత్తు మరియు గూగుల్ మ్యాప్ చూపించిన సందు దారి కలసి వారిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.
కేరళ రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులు కారులో కన్యాకుమారి పర్యటనకు వచ్చారు. ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్ (Google Maps) నావిగేషన్ ఉపయోగిస్తూ ముందుకు సాగారు.
తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన మేలపురం వద్దకు వచ్చేసరికి గూగుల్ మ్యాప్ చూపించిన దారిని అనుసరిస్తూ.. కేవలం బైక్లు లేదా ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లగలిగే అత్యంత చిన్న వీధిలోకి కారును పోనిచ్చారు.
రెండు ఇళ్ల మధ్య ఉన్న సందులో కారు ఇరుక్కుపోవడంతో ముందుకు, వెనక్కి వెళ్లే మార్గం లేక అందులోని యువకులు బయటకు కూడా రాలేక ఇబ్బంది పడ్డారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.
పరిస్థితిని గమనించిన స్థానిక నివాసితులు చొరవ తీసుకుని కారును కష్టపడి వెనుకకు నెట్టుకుంటూ బయటకు తీశారు. ఈ క్రమంలో కారు పక్కనే ఉన్న గోడకు బలంగా తగలడంతో దెబ్బతింది.




