Kasinagar: కాశీనగర్ సమితిలో స్మశాన వాటిక స్థల వివాదం!

Kasinagar: కాశీనగర్ కేసీతాపురంలో స్మశాన వాటిక స్థల వివాదం. వృద్ధురాలి అంత్యక్రియలను అడ్డుకున్న వైనం, రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించిన పోలీసులు!

S.Anil, Gajapati Dst
Published on: 19 Sept 2026 8:53 AM IST
Kasinagar
X

Kasinagar: కాశీనగర్ సమితిలో స్మశాన వాటిక స్థల వివాదం!

Kasinagar: స్మశాన వాటిక స్థల వివాదం పై ఇరు వర్గాల మధ్య ఆందోళన జరిగిన ఘటన గజపతి జిల్లా కాశీనగర్ సమితి కె.సీతాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని హరిజన వాడకు చెందిన కుటుంబాలు చాలా ఏళ్లుగా ఆ స్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. ఓ వృద్ధ మహిళ మృతి చెందగా ఆ ప్రాంతానికి అంత్యక్రియలు చేసేందుకు వెళ్లగా కొంతమంది కాపు కులస్తులు అడ్డుకున్నారు.

ఈ స్థలం తమదంటూ ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించే హక్కు లేదని అన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్నాయి. పోలీసు అధికారి అలోక్ జగదాల చేరుకొని ఇరు వర్గాలతో సంప్రదించి వివాదాన్ని సద్దుమణిగించారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst