Parlakhemundi: పర్లాఖెముండిలో గ్రామ మేట్ మజ్దూర్ సంఘం భారీ ర్యాలీ!

Parlakhemundi: పర్లాఖెముండిలో గ్రామ మేట్ల భారీ ర్యాలీ.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.15 వేల వేతనం ఇవ్వాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత.

S.Anil, Gajapati Dst
Published on: 12 Sept 2026 8:04 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లాఖెముండిలో గ్రామ మేట్ మజ్దూర్ సంఘం భారీ ర్యాలీ!

Parlakhemundi: గత 18 ఏళ్లుగా గ్రామ మేట్ లుగా పనిచేస్తున్న తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలంటూ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర గ్రామ మేట్ మజ్దూర్ సంఘం ఆదేశాల మేరకు గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని జగన్నాథ మందిర ప్రాంతం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజయ్ కుమార్ పాత్ర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రభుత్వ పనులను విజయవంతంగా అమలు చేస్తున్న తమకు ప్రభుత్వ హోదా కల్పించకపోవడం బాధాకరమని అన్నారు.

గత కొన్ని ఏళ్లుగా పదేపదే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నప్పటికీ నెరవేరడం లేదని అన్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి మర్చిపోయారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ హోదా, రూ 15 వేలు నెలసరి వేతనం, సామాజిక భద్రతా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

డిమాండ్లు పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.పలు డిమాండ్లతో ముఖ్యమంత్రి పేరట రాసిన వ్యక్తి పత్రాన్ని కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ కు అందజేశారు. ఈ నిరసనలో సంఘం జిల్లా అధ్యక్షుడు పంచు నాయక్ , భారతీయ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుజిత్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst