Ankit Balyan: సింగర్ అంకిత్ బాల్యన్ హత్య కేసులో సంచలన నిజాలు.. పాటనే ప్రాణం తీసిందా?
Ankit Balyan: హరియాణా సింగర్ అంకిత్ బాల్యన్ హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Ankit Balyan: సింగర్ అంకిత్ బాల్యన్ హత్య కేసులో సంచలన నిజాలు.. పాటనే ప్రాణం తీసిందా?
Ankit Balyan: హరియాణాకు చెందిన యువ సింగర్, నటుడు అంకిత్ బాల్యన్ హత్య వెనక గ్యాంగ్స్టర్ల కక్షలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అతడు నటించిన ఓ పాటనే అతని ప్రాణాలు తీసిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆగస్టు 26న ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట అంకిత్ బాల్యన్ను దుండగులు కాల్చి చంపారు.
'భరీ కోర్ట్ మే గోలీ మారేంగే..' అనే పాటలో నటించడం, అది యూట్యూబ్లో 54 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడమే ఈ హత్యకు ప్రధాన కారణం. ఈ పాటలోని సాహిత్యం తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగిని (2021లో హత్యకు గురయ్యాడు) అవమానించేలా ఉందని 'గోగి గ్యాంగ్' భావించింది.
అంకిత్, ప్రత్యర్థి గ్యాంగ్ లీడర్ టిల్లు తాజ్పురియా ఒకే సామాజిక వర్గానికి చెందినవార కావడంతో, ప్రత్యర్థికి మద్దతుగా ఈ పాట చేశాడని గ్యాంగ్ కక్ష పెంచుకుంది. ఆగస్టు 31న యూపీ పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఈ హత్యకు పాల్పడిన నిందితులు సుమిత్, మోహిత్ మృతి చెందారు.




