Gajapati: రాయగడ గ్రామీణ గృహ నిర్మాణ శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం!

Gajapati: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ గ్రామీణ గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం. షార్ట్ సర్క్యూట్‌తో కీలక ప్రభుత్వ ఫైళ్లు, సామాగ్రి భస్మీపటలం.

S.Anil, Gajapati Dst
Published on: 16 Sept 2026 4:57 PM IST
Gajapati
X

Gajapati: రాయగడ గ్రామీణ గృహ నిర్మాణ శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం!

Gajapati: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ పరిసరాల్లో ఉన్న గ్రామీణ గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో భయంకరమైన అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదం కారణంగా కార్యాలయంలో ఉన్న అనేక ముఖ్యమైన ప్రభుత్వ విలువైన పత్రాలు సామాగ్రి కాలిపోయినట్లు తెలిపారు.

ఈ రోజు కార్యాలయం లోపల నుండి అకస్మాత్తుగా పొగలు రావడం కనిపించింది. కొద్దిసేపట్లోనే మంటలు నలువైపులా వ్యాపించాయి. స్థానికులు, అధికారులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది.

అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడిన తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి, దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎంత మొత్తంలో ఆర్థిక నష్టం జరిగింది, ఎలాంటి ముఖ్యమైన ఫైళ్లు నష్టపోయాయి అనే దానిపై శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst