Husband Sells Wife: భార్య నచ్చలేదని అమ్మేసిన భర్త.. ట్విస్ట్ ఇచ్చిన భార్య
Husband Sells Wife: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది.
Husband Sells Wife: భార్య నచ్చలేదని అమ్మేసిన భర్త.. ట్విస్ట్ ఇచ్చిన భార్య
Gujarat: కలికాలం మహిమో ఏమో కానీ.. నూరేళ్ల జీవితం పంచుకుంటానని ఏడడుగులు వేసిన భార్యను ఓ భర్త కాలరాశాడు. తనకు నచ్చలేదనే ఒకే ఒక్క కారణంతో కట్టుకున్న భార్యను కేవలం రూ.50 వేలకు అమ్మేసిన అమానుష ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. బనస్కాంత జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుషానికి ఒడిగట్టిన భర్తతో పాటు మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఈ కథ అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. నిందితుడు నిఖేష్‌భాయ్ పటేల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన భార్య ఎవరికీ చెప్పకుండా కనిపించకుండా పోయిందంటూ ఒక మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చాడు. తానేమీ ఎరుగనట్లు నటించిన నిఖేష్ కూడా ఒక్కసారిగా మాయమయ్యాడు. దీంతో కొడుకు కనిపించడం లేదంటూ అతడి తండ్రి పోలీసులకు మరో ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తలు ఇద్దరూ వరుసగా అదృశ్యం కావడంతో పోలీసులకు తీవ్ర అనుమానం వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు టెక్నికల్ సర్వైలెన్స్, లోకల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిఖేష్‌ను పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల దెబ్బకు నిందితుడు నిఖేష్ పక్కాగా స్కెచ్ వేసి చేసిన క్రూరమైన నేరాన్ని అంగీకరించాడు. తన భార్య ప్రవర్తన, ఆమె రూపం తనకు నచ్చడం లేదని, ఎలాగైనా వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం తన స్నేహితులైన సంజయ్ ఠాకూర్, అశోక్ ఠాకూర్, సచిన్ దర్బార్‌ల సహాయం తీసుకున్నాడు. అందరూ కలిసి బాధితురాలిని వేరే వాళ్లకు రూ.50 వేల నయాపైసలకు అమ్మేసినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే దాడి చేసి బాధితురాలిని నిందితుల చెర నుంచి సురక్షితంగా కాపాడారు. అయితే, ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. నన్ను కన్నవారికి కాకుండా వేరే వాళ్లకు అమ్మేశారు. ఒక చీకటి గదిలో బంధించి, నాపై నిరంతరం లైంగిక దాడి చేశారు. అంతటితో ఆగకుండా నా ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా బలవంతంగా లాక్కొని అమ్మేసుకున్నారు అని కన్నీరుమున్నీరైంది.
పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు నిఖేష్ పటేల్‌కు సంబంధించిన మరో సంచలన నిజం బయటపడింది. వీడికి ఇదివరకే పెళ్లయిందని, మహిళలను ట్రాప్ చేయడం, కిడ్నాప్ చేయడం వంటి ఘోరమైన క్రిమినల్ హిస్టరీ ఉందని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్ , మోసం, నేరపూరిత కుట్ర వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఏడుగురిని జైలు ఊచల వెనక్కి నెట్టారు. కట్టుకున్న భార్యను వస్తువులా అమ్మేసిన ఈ నరరూప రాక్షసుడికి కఠినమైన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




