India: దేశంలో కొత్తగా మూడు చట్టాలు.. అమిత్ షా సంచలన ప్రకటన!

India: భారతదేశంలో నివసించే హక్కు పౌరులకు మాత్రమే ఉందని, అక్రమ వలసదారులకు ఇది ధర్మసత్రం కాదని కేంద్ర హోమ్‌మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Gagan kumar
Published on: 26 Aug 2026 8:52 AM IST
India
X

India: దేశంలో కొత్తగా మూడు చట్టాలు.. అమిత్ షా సంచలన ప్రకటన!

India: భారతదేశంలో నివసించే హక్కు ఇక్కడి పౌరులకు మాత్రమే ఉంది. అక్రమంగా దేశంలోకి చొరబడే వారికి ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమీ ధర్మసత్రం కాదని కేంద్ర హోమ్‌మంత్రి అమిత్ షా చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

భద్రతా సంస్థల సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశ సరిహద్దులు, అంతర్గత భద్రతపై అత్యంత కీలకమైన హెచ్చరికలు చేశారు. అక్రమ వలసలు కేవలం జనాభా పెంపుకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, అది దేశ మూలాలను దెబ్బతీసే పెద్ద ముప్పని అమిత్ షా స్పష్టం చేశారు.

చొరబాట్ల ద్వారా దేశ సరిహద్దులలో నెట్‌వర్క్‌లు ఏర్పడి తీవ్రవాదానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. పౌరులకు చెందాల్సిన వనరులు, అవకాశాలు అక్రమ రవాణాదారుల పాలుకావడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ వలసల వల్ల స్థానిక జనాభా నిష్పత్తి తీవ్రంగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మత్తు పదార్థాల అక్రమ రవాణా, సరిహద్దు చొరబాట్లు, సరికొత్త పద్ధతుల్లో వస్తున్న టెర్రరిజం వంటి ప్రమాదాలపై భద్రతా ఏజెన్సీలు ఏమాత్రం ఉపేక్షించకూడదని అమిత్ షా ఆదేశించారు. శత్రు దేశాల కుట్రల పట్ల భారత్ ఎల్లప్పుడూ అత్యంత జాగ్రత్తగా, సిద్ధంగా ఉంటుందని తేల్చిచెప్పారు.

చట్టపరమైన చర్యలను మరింత కఠినతరం చేసేందుకు గాను, వచ్చే ఏడాది నాటికి మూడు కొత్త క్రిమినల్ చట్టాలను సంపూర్ణంగా అమలులోకి తీసుకువస్తామని హోమ్‌మంత్రి ప్రకటించారు. శిక్షల అమలును వేగవంతం చేయడం, నేరగాళ్లకు వణుకు పుట్టించడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. దేశ సుస్థిరత, పౌరుల భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story