Shubhanshu Shukla: చంద్రుడు, అంగారకుడిపై నివాసాల కోసం 'భీమ్' కాన్సెప్ట్.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన!
Shubhanshu Shukla: చంద్రుడు, అంగారకుడిపై భవిష్యత్తులో నివసించేందుకు వీలుగా 'భీమ్' (BHEEM) అనే ఆలోచనను భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రతిపాదించారు.
Shubhanshu Shukla: చంద్రుడు, అంగారకుడిపై నివాసాల కోసం 'భీమ్' కాన్సెప్ట్.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన!
Shubhanshu Shukla: భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై మానవులు నివసించేందుకు వీలుగా భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ‘భారతీయ హ్యాబిటబుల్ ఎక్స్‌పాండబుల్ ఎక్స్‌ట్రాటెర్రెస్ట్రియల్ హ్యాబిటాట్’ అనే వినూత్న ఆలోచనను ప్రతిపాదించారు. రష్యాలో శిక్షణ పూర్తి చేసుకుని భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో (IISc) ఆయన ఈ పరిశోధన చేపట్టారు. అంతరిక్షంలో ఉండే తీవ్రమైన రేడియేషన్, విపరీతమైన ఉష్ణోగ్రతల నుంచి వ్యోమగాములను రక్షించే సురక్షిత ఆశ్రయంగా దీన్ని డిజైన్ చేశారు.
భీమ్ (BHEEM) ప్రత్యేకత: అంతరిక్షంలోకి తీసుకెళ్లే నౌకతో పాటు, ఇతర గ్రహాలపై దిగిన తర్వాత మనుషులు తలదాచుకునే నివాసాలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని శుక్లా సూచించారు.
చంద్రుడు, అంగారకుడిపై తీవ్రమైన రేడియేషన్, ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఉంటాయని, రాబోయే 20 ఏళ్లలో భూమికి ఆవల మనుషులు నివసించాలంటే ఇప్పుడే పరిశోధనలు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.




