Indian Railway: ఉబ‌ర్ యాప్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్‌.. ఎలా చేసుకోవాలంటే.?

Indian Railway: ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రయాణికులకు ఉబ‌ర్‌ కొత్త సదుపాయాన్ని అందిస్తోంది.

Mokshith
Published on: 23 Aug 2026 12:46 PM IST
Indian Railway
X

Indian Railway: ఉబ‌ర్ యాప్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్‌.. ఎలా చేసుకోవాలంటే.?

Indian Railway: ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రయాణికులకు ఉబ‌ర్‌ కొత్త సదుపాయాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఉబ‌ర్‌ యాప్‌లోనే ట్రైన్ టికెట్లను సెర్చ్ చేసి బుక్ చేసుకునే అవకాశం ఉంది.

ఉబ‌ర్‌, ఇక్సిగో భాగస్వామ్యంతో ట్రైన్ బుకింగ్ సదుపాయం

ట్రైన్ ప్రయాణికులకు ఒకే యాప్‌లో ఎక్కువ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉబ‌ర్‌ యాప్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. ఉబ‌ర్‌ అధికారిక సమాచారం ప్రకారం, ఈ సేవలు ఇక్సిగో ప్లాట్‌ఫామ్‌లైన ఇక్సిగో, క‌న్ఫామ్ టికెట్‌, అబిబ‌స్ ఇంటిగ్రేషన్ ద్వారా పనిచేస్తున్నాయి.

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు ప్రయాణానికి ముందు, తర్వాత ఉబ‌ర్‌ క్యాబ్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లడం, ట్రైన్‌లో ప్రయాణించడం, గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత స్టేషన్ నుంచి హోటల్ లేదా ఇంటికి వెళ్లడం వంటి అవసరాలను ఒకే యాప్ ద్వారా నిర్వహించుకోవచ్చు.

ఉబ‌ర్ యాప్‌లో ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలి?

ఉబ‌ర్‌ యాప్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేయడం చాలా సింపుల్‌. ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో Uber యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం Services విభాగంలోకి వెళ్లి ట్రైన్ అండ్ బ‌స్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. అనంత‌రం ప్రయాణం ప్రారంభించే స్టేషన్, చేరాల్సిన స్టేషన్, ప్రయాణ తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి.

సెర్చ్ ట్రైన్స్ అండ్ బ‌సెస్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న ట్రైన్ల వివరాలు కనిపిస్తాయి. మీకు అనుకూలమైన ట్రైన్, ప్రయాణ వివరాలను ఎంచుకుని పేమెంట్ పూర్తి చేస్తే బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

PNR స్టేటస్‌తో పాటు ఇతర సేవలు కూడా

ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత PNR ద్వారా టికెట్ పరిస్థితిని కూడా చెక్ చేసుకోవచ్చు. PNRలో టికెట్ కన్ఫర్మ్ అయిందా, RACలో ఉందా లేదా వెయిటింగ్ లిస్టులో ఉందా వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక్సిగో ప్లాట్‌ఫామ్‌లో 10 అంకెల PNR నంబర్‌ ద్వారా స్టేటస్ చెక్ చేసే సదుపాయం ఉంది. అలాగే ట్రైన్ సీట్ల లభ్యత, ట్రైన్ రన్నింగ్ స్టేటస్ వంటి వివరాలను కూడా చెక్ చేసుకునే సదుపాయాలు ఉన్నాయి.

స్టేషన్‌కు వెళ్లేందుకు ఉబ‌ర్‌ క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు

ఈ సదుపాయం వల్ల ట్రైన్ టికెట్ బుకింగ్‌తో పాటు ప్రయాణానికి అవసరమైన క్యాబ్‌ను కూడా ఉబ‌ర్‌లోనే బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్‌కు వెళ్లేటప్పుడు లేదా గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత స్టేషన్ నుంచి ఇంటికి, హోటల్‌కు వెళ్లేందుకు Uber రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు.

అయితే ట్రైన్ టికెట్ సేవలు ఉబ‌ర్‌ సొంత రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా కాకుండా భాగస్వామ్య ప్లాట్‌ఫామ్‌ల ఇంటిగ్రేషన్ ద్వారా అందుతున్నాయి. టికెట్ బుకింగ్‌కు సంబంధించిన నిబంధనలు, ఛార్జీలు, రద్దు, రీఫండ్ వంటి అంశాలు సంబంధిత సేవా భాగస్వాముల నిబంధనలకు లోబడి ఉంటాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story